పొదలకూరు పట్టణంలోని టైలర్స్ కాలనీ సమీపంలోని స్వర్ణ లేఅవుట్ వద్ద మెయిన్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్ - లారీ ఢీకొన్న ప్రమాదంలో చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు వివరించారు. రామయ్య నెల్లూరు నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళుతుండగా ఎదురుగా వెళుతున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.