పొదలకూరులోని బీసీ బాలికల వసతి గృహంలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9, 10 తరగతుల విద్యార్థులకు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులతో వీడియో పాఠాలు అందించేందుకు ఈ సెంటర్ ను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 103 సెంటర్లు ఉండగా జిల్లాలో నాలుగు ఉన్నాయన్నారు.