పొదలకూరు: బోర్డు తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు

58చూసినవారు
పొదలకూరు: బోర్డు తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు
పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ లే అవుట్లో పబ్లిక్ పర్పస్ స్థలంలో పంచాయతీ అధికారులు నాటిన బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తొలగించారు. అయితే పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఈ స్థలం తమదేనని కోర్టుకెళ్లిన వ్యక్తులే తొలగించారని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు, సత్యనారాయణ లే అవుట్ స్థిర నివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్