పొదలకూరు: విద్యుత్తు షాక్ తో యువకుడు మృతి

8చూసినవారు
పొదలకూరు: విద్యుత్తు షాక్ తో యువకుడు మృతి
పొదలకూరు మండలం మరుపూరులో ఆదివారం విద్యుత్ షాక్ తో వంశీ(20) అనే యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం అతని తల్లి లక్ష్మమ్మ ఇంట్లో పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు వాషింగ్ మిషన్ వైరు తగలడంతో లక్ష్మమ్మ కేకలు వేసింది. ఇది గమనించిన కొడుకు వంశీ అక్కడికి వచ్చి లక్ష్మమ్మను తప్పించబోయే క్రమంలో విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడ్డాడు. యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్