మనబోలు మండల హౌసింగ్ ఏఈగా శ్రీపతి శరత్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఆయన మనుబోలు హౌసింగ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈయన గతంలో ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. ఇప్పుడు పదోన్నతిపై ఆయన్ను ఏఈగా ప్రభుత్వం నియమించింది. ఆయన మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు.