సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు మండలంలో మంగళవారం సాయంత్రం పర్యటించనున్నారు. మండలంలోని ముదిగేడు పంచాయతీలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడతారు. రాత్రి 7 గంటలకు నావూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.