వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో తడిచిన ధాన్యాన్ని శనివారం పరిశీలించి రైతులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఒక్కో గ్రామంలో వేలాది పుట్లు తడిచిపోయాయి. దాదాపు పదివేల పుట్లు వర్షానికి తడిసినట్లు తెలుస్తుంది. రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.