సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత డ్రైవర్ కరుణాకర్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం గుడిపల్లిపాడులోని నివాసంలో కరుణాకర్ భౌతికాయానికి సోమిరెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమిరెడ్డి తొలిసారి 1992లో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కరుణాకర్ ఆయన డ్రైవర్ గా చేరాడు. 3 దశాబ్దాలకు పైగా అక్కడే పనిచేస్తూ సోమిరెడ్డికి నమ్మకస్తుడిగా ఉన్నారు.