ఈనెల 26, 27 తేదీలలో విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల, కావలిలో నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంటర్ కాలేజియేట్ పురుషుల ఆటల పోటీల్లో, యూనివర్సిటీ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టగ్ ఆఫ్ వార్ విభాగంలో మొదటి స్థానం, బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో ద్వితీయ స్థానం, యోగా విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి విజయ భాస్కర రావు విద్యార్థులను అభినందించారు.