నెల్లూరు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో అధికారులు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసి హర్ష జైన్, అన్నరాం నల్లారి రంజిత్ కుమార్ లు సరైన బిల్లులు లేకుండా చెన్నై నుండి నెల్లూరుకు తీసుకొని వస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు కారు సీజ్ చేసి జిఎస్టి అధికారులకు అప్పగించారు.