రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో అమరావతి సచివాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. డేగపూడి - బండేపల్లి కాలువ నిర్మాణం, సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ, కండలేరు ఎడమ కాలువ తదితర పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లస్కర్ల సమస్యల పరిష్కారంపైనా మంత్రి రామానాయుడితో చర్చించారు.