తోటపల్లిగూడూరు: విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి

85చూసినవారు
తోటపల్లిగూడూరు: విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి
తోటపల్లిగూడూరు మండలంలోని వెంకన్నపాలెం పంచాయతీ కట్టమీద ముస్లిం కాలనీకి చెందిన షేక్ అనీఫా గేదె విద్యుత్ తీగలు తగిలి శుక్రవారం మృతి చెందింది. బాధితుడు అనీఫా వివరాల మేరకు, రోజులాగే పశువులను మేత కోసం పొలంలోకి తీసుకెళ్లగా విద్యుత్ తీగలు తగిలి ఒక గేదె అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గేదె మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకుని పరిహారం ఇప్పించాలని బాధితుడు కోరారు.

సంబంధిత పోస్ట్