తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీ అనంతపురంలో ఉన్న వాటర్ బేస్ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంటు అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి శనివారం ఆరా తీశారు. అధికారులతో పాటు టీపీ గూడూరు మండల టీడీపీ నాయకుల ద్వారా సోమిరెడ్డి సమాచారం తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ప్రభావం స్వల్పమేనని, అది కూడా ప్లాంటు వరకే పరిమితమైందని నాయకులు ఆయనకు వివరించారు.