టీపి గూడూరు: రేపు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

57చూసినవారు
టీపి గూడూరు: రేపు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
తోటపల్లి గూడూరు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శనివారం ఉదయం 8: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు మరమ్మత్తులు కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నారు. ఇసుక పాలెం, ఈదూరు, సాలిపేట, వరకవిపూడి, అనంతపురం, మల్లికార్జునపురం, పేడూరు, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సుకుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్