విష్ణు ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

62చూసినవారు
విష్ణు ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
మనుబోలు మండల కేంద్రంలోని విష్ణు ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అర్చకులు హనుమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవికి తెల్లవారు జామున ప్రత్యేక పూజలు చేసి క్షీర పంచామృత అభిషేకం ను నిర్వహించారు. సాయంత్రం భక్తులతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా ఆమంచర్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్