విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంపై ఇటీవలి కాలంలో లేవనెత్తబడిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం వైస్ ఛాన్స లర్ విజయభాస్కరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాల్లో ఫలితాలను సకాలంలో అందిస్తున్నామన్నారు. యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.