తాను తోపునని ప్రగల్బాలు చెబుతూ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పరారయ్యారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వెంకటాచలం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదాపురం రుస్తుం మైన్ లో అక్రమ మైనింగే జరగలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు.