వెంకటాచలం మండలంలోని కాకుటూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ యన్ ఎస్ ఎస్, పియంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంపొందించడం సమాజానికి చాలా అవసరమని పేర్కొన్నారు.