నాయుడుపేట మండల పరిధిలోని తుమ్మూరు గ్రామంలో ఉన్న టీటీడీ సంబంధిత ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ కరీమాణిక్య స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు చప్పర ఉత్సవం, సాయంత్రం మోహిని ఉత్సవం వంటి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారి గజ వాహనంపై అమ్మవార్లు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.