సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ తల్లి పరమేశ్వరి అమ్మవారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ కమిషనర్ శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో సహాయక కమిషనర్, కార్య నిర్వహణ అధికారి బి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 105 రోజులకు గాను 53,23,998 రూపాయల నగదుతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లు, డాలర్ల రూపంలో ఆదాయం సమకూరినట్టు తెలిపారు.