సూళ్లూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ. ఇకపై ప్రతి శనివారం గ్రీవెన్స్ డే జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.