రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి సాధ్యమని సూళ్లూరుపేట నియోజవర్గం ఎమ్మెల్యే విజయ శ్రీ, టీడీపీ సూళ్లూరుపేట ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. పల్లె నిద్రలో భాగంగా శుక్రవారం రాత్రి కురగొండ గ్రామంలో సుమారు కోటి రూపాయల నిధులతో జలజీవన్ మిషన్, సిసి రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు.