సూళ్లూరుపేట: రాత్రి వేళల్లో యథేచ్చగా మట్టి తరలింపు

51చూసినవారు
సూళ్లూరుపేట: రాత్రి వేళల్లో యథేచ్చగా మట్టి తరలింపు
సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం రోసనూరులో ప్రభుత్వ భూముల నుంచి రాత్రి వేళల్లో యథేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్లతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్న మాఫియాకు సంబంధిత శాఖల అధికారులు అండదండలు ఉన్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాలని సంబంధిత శాఖల అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్