తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వేసవి కాలంలో పక్షులు ఆహారం, తాగునీటికి ఇబ్బంది పడకుండా జిల్లా పోలీస్ గ్రౌండ్ లో శనివారం పక్షులకు చిన్న మట్టి పాత్రలో చిరుధాన్యాలు, తాగునీరు శనివారం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలో పక్షులకు ఇలాంటివి ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.