చైనా బోర్డర్ లో ఉదయగిరి వాసి గురువారం జాతీయ జెండా ఎగరవేశాడు. ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న ఉదయగిరి మండలం సర్వనాబాద్ గ్రామానికి చెందిన దారపనేని దినేష్ ప్రస్తుతం భారత్- చైనా సరిహద్దుల్లో నిధులు నిర్వహిస్తున్నాడు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తోటి జవాన్లతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి జైహింద్ అంటూ నినాదాలు చేశాడు. ఉదయగిరి వాసులు తలెత్తుకునేలా చేశాడని పలువురు ఆయనను అభినందించారు.