కలిగిరి: కారు, బైక్ ఢీకొన్న ఘటనలో రైతుకు గాయాలు

64చూసినవారు
కలిగిరి: కారు, బైక్ ఢీకొన్న ఘటనలో రైతుకు గాయాలు
సంఘం-కలిగిరి ప్రధాన రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. కమ్మవారిపాలేనికి చెందిన కాట్రగుంట రాఘవేంద్ర ద్విచక్ర వాహనంపై పొగాకు బోర్డు కార్యాలయానికి వస్తుండగా కలిగిరి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్