కలిగిరి: అంబులెన్స్ లోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

60చూసినవారు
కలిగిరి: అంబులెన్స్ లోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
108 అంబులెన్స్ లో ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలిగిరి మండలంలో జరిగింది. కలిగిరి మండలం నర్సారెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవికి సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 లో ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలిస్తుండగా బట్టువారిపాలెం సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. సిబ్బంది సురక్షితంగా అంబులెన్స్ లోనే కాన్పు చేయడంతో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.

సంబంధిత పోస్ట్