దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో 2007, 2008 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదటగా అమ్మవారికి పూజలు, పల్లకి సేవ చేపట్టారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా గురువారం అమ్మవారి దేవస్థానానికి వచ్చిన భక్తులకు, సమీపంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.