మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 11వ భాగం ఉపాధి కూలీలకు పని దినాలు పెంచాలని ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ఈపిఓ శ్రీనివాసులు తెలిపారు. ఉదయగిరి పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలకు పనితో పాటు దినసరి వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొలతల ప్రకారం పనులు చేపించాలన్నారు.