ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఆటో ఐదుగురికి గాయాలు

84చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఆటో ఐదుగురికి గాయాలు
ఆర్టీసీ బస్సును ఆటో ఢీ కొట్టిన ఘటన దుత్తలూరు మండల పరిధిలో ఆదివారం జరిగింది. దుత్తలూరు పట్టణానికి సమీపంలో పామూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మందలపు నాయుడు పల్లి గ్రామానికి చెందిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు మొత్తం ఐదుమందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 సహాయంతో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్