ఉదయగిరి మండల బీజేపీ అధ్యక్షులు మోటపోతుల చెన్నయ్య ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ పథకాలతో పాటు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమన్వయంతో పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని అన్నారు. కేంద్ర, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.