పశువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
పశువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలి
మూగజీవాలు, పశువుల పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని గండిపాలెం పశువైద్యశాల ఇన్ ఛార్జ్ అనుష తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జీవాలకు గొంతువాపు ప్రమాదకరమైందన్నారు. కలుషిత నీరు తాగడం, మేత మేయడం ద్వారా పశువులు వ్యాధి నిరోధక శక్తి తగ్గి గొంతు వాపు బారిన పడతాయన్నారు. వ్యాధుల సోకకుండా ముందస్తుగా యజమానులు టీకాలు వేయించాలన్నారు. ఎప్పటికప్పుడు పశువులను గమనిస్తూ సంరక్షించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్