వింజమూరు మండల టిడిపి మాజీ కన్వీనర్ గూడా నర్సారెడ్డి కుమారుడు నరేంద్ర రెడ్డి వివాహానికి హాజరుకావాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరులోని ఆయన స్వగృహంలో బుధవారం కలిసి ఆహ్వానించారు. ఎంపీ స్పందించి కచ్చితంగా వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబులరెడ్డి, తదితరులు ఉన్నారు.