దగదర్తి మండలంలోని చెన్నూరు, రంగసముద్రం, ఐతంపాడు గ్రామల ప్రజలు సోమవారం సాయంత్రం మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీందర్ నాయుడుని కలిశారు. దగదర్తి లోని మాలేపాటి నివాసంలో కలిసి వారి సమస్యలను తెలుపుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇంటి నిర్మాణాలు చేసుకోలేని స్థితిలో ఉన్నామని విన్నవించుకోగా. మాలేపాటి రవీంద్ర నాయుడు మానవతా దృక్పథంతో వారికి సిమెంటు, రేకులు అందిస్తానని హామీ ఇచ్చారు.