నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ సుజాత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపి, కాన్పుల శాతాన్ని పెంచాలని సూచించారు. జూన్ 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకమైన వెంగమాంబ తిరునాళ్ళు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు అందించే వైద్య సేవలు విషయంపై సిబ్బందితో మాట్లాడారు.