నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులోని రేషన్ దుకాణాన్ని తహశీల్దార్ ఎనమల నాగరాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలోని నిల్వలు, నిత్యవసర వస్తువులను ఆయన పరిశీలించారు. చౌక దుకాణం డీలర్ దుకాణం వద్ద సరుకుల వివరాలు, నిల్వలు బ్లాక్ బోర్డులో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వినియోగదారులకు సకాలంలో నిత్వవసర సరుకులు పంపిణీ చేయాలని తెలిపారు.