ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దుత్తలూరు పిహెచ్సి ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ మాట్లాడుతూ చలితో కూడిన జ్వరం మలేరియా వ్యాధి ప్రధాన లక్షణం అన్నారు. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని నిద్రపోయేటప్పుడు దుప్పటి పూర్తిగా కప్పుకోవాలని సలహాలు ఇచ్చారు.