దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకుటిడిపి సభ్యత్వ కార్డులను బూత్ ఇన్ చార్జ్ సూరే వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు. అలాగే సభ్యత్వం యొక్క ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు దుగ్గినబోయిన మాల్యాద్రి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు ఈగ మాలకొండారెడ్డి, బిసి సెల్ ప్రధానకార్యదర్శి మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.