దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్ సమీపంలోని రెడ్లదిన్నె గ్రామం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు జరగనున్నాయి. దీంతో ఆలయాన్ని ప్రత్యేకంగా పరిమళ పుష్పాలతో అలంకరించారు. కాగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులు ఈ ఆలయానికి ఎక్కువగా తరలివస్తుంటారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది.