దుత్తలూరు లో మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సోమవారం పత్రిక విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ టీటీడీలో చనిపోయిన గోవులపై ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. అలాగే వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలులో విఫలమైందని ఆగ్రహించారు. అలాగే కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నాయకులతో మాట్లాడారు.