దుత్తలూరు: రెడ్లదిన్నె గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట

81చూసినవారు
దుత్తలూరు: రెడ్లదిన్నె గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట
శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్- ప్రవీణ దంపతులు పాల్గొన్నారు. దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో గత రెండు రోజులుగా విశిష్ట పూజలు నిర్వహించారు. మూడవరోజు ఆదివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. శిఖర ప్రతిష్ట చేసి కలశానికి కుంభాభిషేకం నిర్వహించారు. ధనం, ధాన్యాలను భక్తులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్