దుత్తలూరు(మం) నర్రవాడలో ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిఎం శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఉదయగిరి, బద్వేల్, పోరుమామిళ్ల, సీతారాంపురం నుంచి బస్సులు నడుస్తాయన్నారు. కావలి, కందుకూరు, నెల్లూరు డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. కాగా వెంగమాంబ తిరునాళ్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి.