నేటి నుంచి వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దుత్తలూరు మండలం నరవాడలో వెలసి ఉన్న వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి గురువారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు వేళల్లో భక్తులు వస్తారు. ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భారీ ఏర్పాట్లు చేయించారు. ఈ ప్రాంత ప్రజలకు వెంగమాంబ తిరునాళ్లు అంటే అతిపెద్ద పండుగ.