వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం మండల వైద్యాధికారిని కరిష్మా ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలను అందించారు. ఆమె 55 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.