ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన

85చూసినవారు
ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన
వేలాది మంది ప్రజలతో ఉదయగిరి రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగా మంగళవారం ఉదయం జరిగింది. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇన్ ఛార్జ్ కలెక్టర్ కే. కార్తీక్, అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరి చేత యోగాసనాలు వేయించారు. పర్యాటకంగా ఉదయగిరి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. మానసిక, శారీరక అద్భుత ప్రయోజనాలు ఉన్న యోగా అందరూ చేయాలని ఇన్ ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్