దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సమయంలో ఆకాశం మేఘాలతో కమ్ముకుపోయి, తీవ్రమైన గాలులు విస్తృతంగా వీచాయి. హఠత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో గ్రామ ప్రజలు తడిసి ముద్దవుతుండగా, స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.