కలిగిరి మండలంలో అగ్నిప్రమాదంతో మూడు పోకాకు బ్యార్నీలు దగ్ధమయ్యాయి. కలిగిరి మండలంలోని కృష్ణారెడ్డి పాలెం పంచాయతీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పొగాకు బ్యార్నీలు దగ్దమయ్యాయి. ఈ ఘటనతో దాదాపు రూ. 30 లక్షల వరకు నష్టం వాటిలినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.