జాతీయ రహదారి పనుల పరిశీలన

82చూసినవారు
జాతీయ రహదారి పనుల పరిశీలన
కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం వరకు జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి కేటాయించిన భూమి హద్దుల మేరకే పనులు నిర్వహించుకోవాలని ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర రెడ్డి ఆదివారం సూచించారు. సీతారామపురం నుంచి పోరుమామిళ్ల ఘాట్ రోడ్ మార్గంలో రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అటవీ శాఖ సిబ్బంది పనులు పర్యవేక్షించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్