వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని జలదంకి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు వి. హైమావతి అన్నారు. శుక్రవారం జలదంకి మండలంలోని గమల్లపాలెం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుర్వేద వైద్యం పై ప్రజలకు అవగాహన కల్పించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.