జలదంకి మండలం గట్టుపల్లి లో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన నీలం చిన్నయ్య వద్ద నుంచి తొమ్మిది 180 యమ్ యల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చిన్నయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుంకర శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని, చర్యలు చాలా తీవ్రతరంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దేవిక పాల్గొన్నారు.